telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ సినిమాలో రొమాంటిక్ సీన్లు లేవు…!?

Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎలక్షన్ల లోపు సాధ్యమైనన్ని సినిమాలు చేసి మళ్లీ పాలిటిక్స్‌తో బిజీ అవ్వాలనే పవన్ ప్లాన్‌కు కరోనా రూపంలో అడ్డు తగిలింది. ఇక క్రిష్-పవన్ చేయాలనుకుంటున్న ‘విరూపాక్ష’ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించి ఈ మధ్య కాస్త గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో ప్రగ్యా జైస్వాల్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. మరో ముఖ్యపాత్రలో అనసూయ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే పవన్‌కళ్యాణ్‌ రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని తన సినిమాల్లో పాటలకు డ్యాన్సులు కానీ రొమాంటిక్‌ సీన్లు కాని ఉండకుండా ప్లాన్‌ చేసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. పవన్‌-క్రిష్‌ కథానుగుణంగా బ్యాక్‌డ్రాప్‌ సాగే రెండు పాటలు మాత్రమే ఉంటాయని ఇప్పటికే వార్త ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

Related posts