telugu navyamedia
సినిమా వార్తలు

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ కు భారీ రెమ్యునరేషన్‌..!

 

ఎంతగానో అలరిస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్​బాగ్ ఐదో సీజన్ త్వరలో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటిస్తూ..లోగో కూడా రిలీజ్ చేసింది. అయితే యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జశ్వంత్ కి ఇస్తున్న రెమ్యునరేషన్‌ ఇప్పడు వైరల్ గా మారింది. ఎందుకంటే మనోడి క్రేజ్ అలాంటిది.

‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ వెబ్‌సిరీస్‌తో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న షణ్ముఖ్‌ జస్వంత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్‌, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్‌ ఒక్క వీడియో పోస్ట్‌ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే.

షణ్ముఖ్‌ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు కూడా అతడికి భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌-5లో మరే కంటెస్టెంట్‌కి లేని విధంగా షణ్ముఖ్‌కి కోటి వరకు పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్‌ అంగీకరించారట. ఇప్పటివరకు ఇప్పటివరకు ఇంత భారీ రెమ్యునరేషన్‌ అందుకున్న వాళ్లలో యాంకర్‌ శ్రీముఖి మాత్రమే ఉన్నారు.

ఈ నేపథ్యంలో..హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల్ లిస్ట్ ఒకటి తాజాగా బయటకి వచ్చింది. ఈ జాబితాలో యాంకర్లు వర్షిణి, రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, జబర్దస్త్‌ ప్రియాంక, హనీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, పూనం భాజ్వా, యాంకర్‌ శివ, లోబో, యాంకర్‌ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక సెప్టెంబర్‌ 5న బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

Related posts