ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి, మాస్క్ గురించి అవగాహన కలిగిస్తూ తాజాగా రూపొందిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవితోపాటు యంగ్ హీరో కార్తికేయ కూడా నటించాడు. ఆ వీడియోను, మెగాస్టార్‌తో నటించిన అనుభవాన్ని కార్తికేయ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `కరోనా భయం, షూటింగ్‌ని మిస్ అవడం, తర్వాత ఎలా ఉంటుందనే భయం.. ఈ ఒక్క వీడియోతో అన్నీ తీరిపోయాయి. ఓ మంచి పని కోసం మెగాస్టార్‌గారితో కలిసి నేను ఓ వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదు. మెగాస్టార్ సర్‌తో ఇది నా జీవితకాల జ్ఞాపకం` అని కార్తికేయ ట్వీట్ చేశాడు.
Corona bhayam ,shooting ni misss avdam ,next ela untundo ani bhayam anni theeripoyayi ..
EE okkka video tho..#Megastar garitho Nenu kalsi oka manchi cause kosam video cheydam ..na cinemalu padi release ayina ee kick radhu..
One more life time memory with @KChiruTweets sir https://t.co/PyxovvOmsE— Kartikeya Gummakonda (@ActorKartikeya) July 16, 2020
శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవిలత