telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 7 (శనివారం) రాశి ఫలాలు

మేషం: అనుకున్న పనులన్నిటినీ దాదాపు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. వీలైనంత వరకు మీ మాటలను నియంత్రించండి. అంతేకాకుండా సంబంధాల విషయంలో బాధ్యత వహించండి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం: ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టండి.

మిథునం : వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. అన్ని రంగాల్లో మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. చాలావరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆరోగ్యానికి డోకా లేదు.

కర్కాటకం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వీలైనంత వరకు మీ ఖర్చులను తగ్గించుకోండి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. పెళ్లి సంబంధం పెండింగ్‌లో పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం: ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని లాభాలుంటాయి.

కన్య: విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పట్టుదలగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తల పెట్టిన పనులు విజయాన్నిస్తాయి.

తుల: తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ప్రయత్నిస్తే మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది.

వృశ్చికం: మిశ్రమ కాలం. అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలుంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.

ధనుస్సు: బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పాజిటివ్ గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిలపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి.

మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది.

కుంభం: ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తల పెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు.

మీనం: ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువులతో జాగ్రత. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి.

Related posts