telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ్ తో ఇలియానా రొమాన్స్ ?

Ileana

కింగ్ నాగార్జున చివరగా నటించిన చిత్రం “మన్మధుడు 2” దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ్. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత పంపిణీదారుడు నారాయణ్ దాస్- పుస్కూర్ రామ్ మోహన్ రావు- శరత్ మరార్ నిర్మించనున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గోవా బ్యూటీ ఇలియానాకు నాగ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడట. అయితే ఈ భామ చివరిసారిగా తెలుగులో రవితేజతో నటించిన “అమర్ అక్బర్ ఆంటోని” సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Related posts