telugu navyamedia
సినిమా వార్తలు

ఆన్‌లైన్‌లో ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ సేవలు..

మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లో ట్రస్ట్ వెబ్ సైట్ ను చిరు తనయుడు రామ్ చరణ్ లాంచ్ చేశారు.

మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్‌, ఐ బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Ram Charan Teja launches 'Chirajeevi Charitable Trust' website! | Telugu Movie News - Times of India

ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్​లోని సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులోని నిల్వల గురించి తెలుకోవచ్చని.. వెంటనే సాయం పొందవచ్చని రామ్​చరణ్​ వెల్లడించారు. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే.. ఈ సైట్​​ ద్వారా స్లాట్​బుక్​ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎవరికైనా రక్త, నేత్ర దానం కావాలనుకుంటే.. చిన్న రిక్వెస్ట్ పెడితే మేం వెంటనే రెస్పాండ్ అవుతామన్నారు. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంకులను మాత్రమే నిర్వహిస్తున్నాం. త్వరలోనే మిగిలిన అన్ని ఆర్గాన్స్​కి​ ప్రత్యేక బ్యాంక్స్​ నెలకొల్పేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు చెప్పారు.

PICS: Ram Charan spotted in the city as he launches his father's Chiranjeevi Charitable Trust | PINKVILLA
‘నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరో 30 ఏళ్లపాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండో దశలో బ్లడ్​బ్యాంకు కోసం ప్రత్యేక యాప్ తయారు చేయాలనే ఆలోచన ఉంది. నాన్న, నా సినిమా పారితోషకాలతోనే ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కొనసాగుతోంది. మరింత మందికి సాయం అందుతుందంటే దాతల నుంచీ విరాళాలు సేకరిస్తాం. ఆ వివరాలు సహా ట్రస్టులో పూర్తిస్థాయి నియామకాలను నాన్న త్వరలో ప్రకటిస్తారు.’

అంతేకాకుండా చిరంజీవి పర్సనల్‌ www.kchiranjeevi.com వెబ్‌సైట్‌ను కూడా రామ్‌చరణ్ ప్రారంభించారు. మెగాస్టార్ సినీ జీవితాన్ని ప్రజలతో పంచుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చిరంజీవి మూవీస్ డిటైల్స్, ఫొటోలు, పాటలు ఈ సైట్‌లో ఉంటాయ‌ని అన్నారు.

 

Related posts