telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండు భారీ చిత్రాలపై … బెట్టింగులు కూడా రికార్డు స్థాయిలోనే …

huge betting on two big movies

ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి సృష్టించిన సంచలనాల్ని ఎప్పటికి మర్చిపోలేమన్న విషయం అందరికి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్ ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న ఈవెంట్ జరిగిన ప్రతిసారీ బాహుబలి టాపిక్ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే కనిపిస్తోంది. సాహో- సైరా రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కినవి. సైరా 270 కోట్ల బడ్జెట్ అయితే, సాహో 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా లుక్ ఉన్న సినిమాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు కొల్లగొడతాయన్న విశ్లేషణ సాగుతోంది. ఇప్పటికే సైరా, సాహో సినిమాల నుండి రిలీజైన టీజర్లు.. మేకింగ్ వీడియోలు.. ఈ సినిమాలపై భారీ అంచనాలను రేకెత్తించాయి.

ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రేట్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న బాలీవుడ్ లో కూడా ఈ రెండు సినిమాల గురించే హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా, సాహో వీరాభిమానులు సినిమాలపైనా బెట్టింగులు కడుతూ వేడి పెంచేస్తున్నారా? అన్న సందేహం కలుగుతోంది. సాహో ఈనెల 30న రిలీజవుతోంది. సరిగ్గా నెలరోజులకు అక్టోబర్ 2న సైరా రిలీజవుతోంది. రిలీజ్ ముందు భారీగా ప్రమోషన్ ఈవెంట్లతో రెండు టీమ్ లు పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ 700 కోట్ల పైనే సైరా వసూలు చేస్తుందని అంటుంటే, ప్రభాస్ ఫ్యాన్స్ సాహో ఇంకా అంతకన్నా ఎక్కువే కలెక్ట్ చేస్తుందని ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు.

Related posts