telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4″లో హాట్ యాంకర్ అనసూయ ?

Anasuya

తెలుగులో ‘బిగ్ బాస్’ ఇంతవరకూ 3 సీజన్లు పూర్తి చేసుకుంది. 4వ సీజన్ కి సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇంతకుముందు మాదిరిగానే ఈసారి కూడా ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో సెలబ్రిటీని ఎంపిక చేయనున్నారని అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో హాట్ యాంకర్ అనసూయ పేరు విన్పిస్తోంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా అనసూయను కూడా ఈ షో నిర్వాహకులు సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు ఆమెకి ఎపిసోడ్ కి లక్ష రూపాయలను చెల్లించినట్టుగా చెప్పుకున్నారు. ఆ లెక్కన చూసుకుంటే అనసూయకు అంతకంటే ఎక్కువనే ఇవ్వవలసి ఉంటుంది. అందువలన షో నిర్వాహకులు భారీ మొత్తమే ఆఫర్ చేశారట. అయినా అనసూయ ఆసక్తిని చూపలేదని అంటున్నారు. అంతకాలం పాటు తాను ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. ఇక ఒక వైపున టీవీ షోలతోను .. మరో వైపున సినిమాలతోను అనసూయ బిజీగా ఉండటం కూడా ఆమె ‘నో’ చెప్పడానికి కారణమని అనుకుంటున్నారు.

Related posts