telugu navyamedia
సినిమా వార్తలు

నామినేషన్‌ను వెనక్కి తీసుకున్న బండ్ల గణేశ్‌

‘మా’ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ఊహించిన షాక్‌ ఇచ్చాడు. తాజాగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.

ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌లతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ట్వీట్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చాడు.

‘మా’ జనరల్‌ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతూ బండ్ల గణేశ్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది.

Related posts