telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు

Divi

తెలుగు బిగ్‌బాస్-4 కంటెస్టెంట్ దివికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. చాలా సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్‌బాస్‌ తర్వాత హీరోయిన్ అవకాశాలపై ఆశలు పెట్టుకుంది. దసరా రోజు సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌లోనే సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంటు దివి వైద్య ఎలిమినేట్ అయ్యింది‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న దివి అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో చేసిన స్నేహ‌మే ఆమెకు శాపంగా మారింది. ఈ కార‌ణం వ‌ల్లే ఆమెకు మోనాల్ క‌న్నా త‌క్కువ ఓట్లు ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. దీంతో ద‌స‌రా పండ‌గ రోజే అంద‌రి నుంచి న‌వ్వుతూనే సెల‌వు తీసుకుంది. అయితే ఆ సందర్భంగా దివికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని కోరగా హీరో కార్తికేయను సమంత కోరగా ఆయన కూడా సరేనన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం తెరకెక్కిస్తున్న రెండు వెబ్ సిరీసుల్లో దివికి ఆఫర్లు వచ్చాయి. దీంతో పాటు మరో రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తలుపు తట్టినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్‌ అవకాశం దివి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

Related posts