telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ : కీరవాణి చెప్పిన కరచాలనం కవిత వైరల్…

keeravani

కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. హైదరాబాద్లో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ముఖ్యంగా షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగలించుకున్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడు భారతీయ సంప్రదాయాలవైపు విదేశీయులు చూస్తున్నారు. ఎదురెదురుగా కనిపిస్తే ఒకప్పుడు కరచాలనం చేసుకునే వారు.. ఇప్పుడు చేతులు జోడించి నమస్కారాలు పెట్టుకుంటున్నారు. కరోనా కలకలం నేపథ్యంలో కీరవాణి పాడిన ఓ పాత కవిత ఇప్పుడు వైరల్‌ మారింది. నమస్కారం గొప్పదనాన్ని తెలిపే ఈ కవితను చైతన్య ప్రసాద్ రచించగా కీరవాణి పాడారు. వెయ్యి రోగాల పుట్ట ఈ చెయ్యి కనుక చాలు చాలు కరచాలనాలు దండమెట్టినవేరా ధన్య జీవి అంటూ సాగే ఈ కవితను కీరవాణి అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా మన దైనందిత జీవితంలో చేయి చేసే పనులను ఆయన చెప్పిన తీరు అందరినీ నవ్విస్తూ ఆలోచింపజేస్తోంది. ఇక ఈ వీడియోలో రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా ఉన్నారు.

Related posts