telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మాస్కుల విషయంలో గుజరాత్‌ ప్రభుత్వం అనూహ్యనిర్ణయం…

Mask

కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోంది అనే విషయం తెలిసిందే. మన దేశంలో కూడా రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలోనే గుజరాత్‌ ప్రభుత్వం అనూహ్యనిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా రెండో విడత విజృంభనను అడ్డుకునేందుకు అనేక ప్రయాత్నాలను ప్రభుత్వం చేపట్టింది.  అయితే గుజరాత్ మరో అడుగు ముందుకేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరీ చేసింది. ఎవ్వరైనా మాస్క్ ధరించకపోతే వారికి యాంటీ జెంట్స్ పరీక్ష చేసి వారికి కరోనా పాజిటివ్, నెగిటివ్‌లను నిర్ధారిస్తుంది. ఒకవేల ఎవరైనా మాస్క్ ధరించని వారికి కరోనా పాజిటివ్ వస్తే వారిని క్వారంటైన్ పంపి వెయ్యి రూపాయల జరిమానాను విధిస్తుంది. కరోనా నెగిటివ్ వస్తే కేవలం జరిమానా విధిస్తుంది. అయితే ఈ సమాచారాన్ని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇరీ ఒక మంచి ఉపాయమని కొందర అంటున్నారు. అయితే ఈ పరిక్షలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. అయితే ఇదే విధమైన నిర్ణయాన్ని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

Related posts