telugu navyamedia
సినిమా వార్తలు

ముంబయిలో ఆర్ ఆర్ ఆర్ బిగ్ ఈవెంట్‌..

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ , యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో న‌టించిన సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నారు. అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచిన‌ చిత్ర‌యూనిట్ ముంబైలో `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ను నిర్వ‌హించారు.

RRR movie pre-release event in Dubai : దుబాయ్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ ? | వినోదం News in Telugu

అంతేకాదు ముంబయిలో తెలుగు హీరోల కటౌట్లు సందడిచేస్తున్నాయి. జనరల్‌గా మన దగ్గర సినిమా విడుదల టైమ్‌లో కటౌట్లు పెడతారు. అదికూడా పెద్ద హీరోలకే ఉంటుంది. కానీ ఇప్పుడు ముంబయిలో మన తెలుగు హీరోల కటౌట్లు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

ntr ram charan rajamouli grand entry to rrr mumbai event salman hulchul as guest

అల్లూరి గెటప్‌లో ఉన్న రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌ గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్‌ కటౌట్లు `ఆర్‌ఆర్‌ఆర్‌` ముంబయి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదిక సమీపంలో ఏర్పాటు చేశారు. ఇవి అంద‌రిని ఆకట్టుకుంటున్నాయి.

ntr ram charan rajamouli grand entry to rrr mumbai event salman hulchul as guest

ఈ బిగ్‌ ఈవెంట్‌కుముఖ్య అతిథిగా  బాలీవుడ్‌ స్టార్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్ గా హాజరయ్యారు.  సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ntr ram charan rajamouli grand entry to rrr mumbai event salman hulchul as guest

ఈవెంట్‌కు ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొన్నారు. వీరితోపాటు హిందీ వర్షెన్‌ ప్రజెంటర్‌ కరణ్‌ జోహార్‌, ఈవెంట్‌ గెస్ట్ సల్మాన్‌ ఖాన్‌, హీరోయిన్లు అలియా భట్‌, శ్రియా పాల్గొన్నారు.

ఇక ఈవెంట్‌కి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఎంట్రీ అదిరిపోయింది. పై నుంచి సింహాసనం పై నుంచి దిగుదుతూ అభిమానులకు పూనకాలు తెప్పించారు. రాజమౌళికి సైతం గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు.

Don't Dare To Release Any Film For 4 Months After RRR - Movie News

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడూతూ ‘‘రామ్‌ చరణ్‌ అభిమానులందరికీ స్వాగతం. బహుశా..ఈ కలయిక (చరణ్‌తో తన కాంబినేషన్‌ను ఉద్దేశించి) దేవుడు నిర్ణయించినదేమో అని అన్నారు.

మ‌రోప‌క్క ముంబయి ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈవెంట్‌ ప్రారంభం నుంచి హంగామా చేశారు. గట్టిగా అరుస్తూ తమ హీరోకి చూడ‌డానికి  అక్కడ ఉన్న భారీకేడ్లు, ఇతర నిర్మాణాలపైకి ఎక్కి గోల చేశారు. బాగా అరుస్తూ ఈవెంట్‌కి అడ్డంకిగా మారారు.

దీంతో కరణ్‌ జోహార్ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ అన్న మీ అభిమానులను ఎవరూ ఆపలేరు. తారక్‌ అభిమానులను ఈ తరహాలో నేనెప్పుడూ చూడలేదు` అని పేర్కొన్నారు.

RRR Pre Release Event: ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి మైండ్‌ బ్లోయింగ్‌ ఎంట్రీ.. ముంబయిలో రామ్‌, భీమ్‌ భారీ కటౌట్లు | ntr ram charan rajamouli grand entry to rrr mumbai event salman hulchul ...

దీంతో ఇది గమనించిన ఎన్టీఆర్  తన అభిమానులను హెచ్చరించారు.  `పద్ధతిగా లేదు.. కిందకి దిగండి. కిందకి దిగుతారా దిగరా. కిందికి దిగాలి..కిందికి దిగి ఎంజాయ్ చేయండి. రాష్రం కాని రాష్రం వ‌చ్చాం..మన గురించి అందరు బాగా మాట్లాడుకోవాలి. కిందకి దిగండి` అంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

Related posts