అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్..ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. అయితే ఇటీవల సమంతా ఓ పోస్ట్ చేయడంతో నెటిజన్లు అమ్మడిని తెగ ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తను విలన్‌గా చేసిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్2 ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ సమంత ఓ ఫోటో దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌పై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాలుగు సంవత్సరాల బంధం మాది అని ఫోటో కింద రాసుకొచ్చింది. దానికి అతడు ఐ లవ్ యూ అని రిప్లై కూడూ ఇచ్చాడు. అయితే ఎంతటి బంధమైనా అతడిపై కాళ్లు పెట్టి పడుకోవడం బాలేదని, అంతేకాకుండా దానికి ఆయన ఐ లవ్ యూ అని బదులివ్వడమేందటని తెగ ట్రోల్ చేశారు. దీంతో సమంత ఆ పోస్ట్‌ని డిలీట్ చేసింది. ఇదిలా ఉంటే సమంతా చేసిన దిఫ్యామిలీ మ్యాన్2 ఫిబ్రవరీ12న రిలీజ్ కానుంది. అంతేకాకుండా సమంత చేయనున్న శాకుంతలం కూడా పట్టాలెక్కనుంది.
previous post