telugu navyamedia
సినిమా వార్తలు

ఘ‌నంగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం..

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్ ల‌వ్ బ‌ర్డ్స్‌ ఎట్టకేలకు ఏడడుగులు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. గురువారం సాయంత్రం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో కొంతమంది కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సమక్షంలో స్టార్ జంట వివాహం వీరి వివాహం ఘనంగా జరిగింది.

కబీర్​ ఖాన్​, అంగద్​ బేడీ, మినీ మథుర్​, నేహా థూపియా వంటి ప్రముఖులు హాజరయ్యారు.

 ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించి ఫొటోలను ఈ కొత్త జంట సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మేము కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలను కోరుకుంటున్నామ‌ని అంటూ పోస్ట్‌ షేర్‌ చేశారు.

మంగళవారం మెహందీ వేడుకతో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. బుధ‌వారం రాత్రి సంగీత్ జరిగింది. కాగా.. రెడ్ క‌ల‌ర్‌ వివాహ దుస్తుల‌లో వధూవరులుగా ఎంతో అందంగా కనిపించారు. ఈ దుస్తుల‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు.

రాజస్థాన్​లోని సెవెన్​సెన్స్​ ఫోర్ట్​లో వీరి వివాహం గురువారం ఘనంగా జరిగింది.

కత్రినా వేసుకున్న  డ్రెస్  టిల్లా వర్క్‌తో చేతితో నేసిన మట్కా సిల్క్‌లో క్లాసిక్ రెడ్ లెహంగా, వెల్వెట్‌లో ఎంబ్రాయిడరీ వ‌ర్క్‌తో చేశారు. విక్కీ కౌశల్ ధరించిన మరోరీ ఎంబ్రాయిడరీ, సిల్క్ కుర్తా , చురీదార్‌తో ఐవరీ సిల్క్ షేర్వాణీలో అందంగా క‌నిపించాడు. ఐకానిక్ హ్యాండ్‌క్రాఫ్ట్ బంగారు పూతతో కూడిన బెంగాల్ టైగర్ బటన్‌లు ఉన్నాయి.

ఈనెల 7న ఘనంగా ప్రారంభమైన పెళ్లి వేడుకలు ధూమ్​ధామ్​గా జరిగాయి.

ఈ జంట 2019 నుంచి వీరు ప్రేమ‌లో ఉన్న వీరు గ‌త‌ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరి వివాహానికి కబీర్​ ఖాన్​, అంగద్​ బేడీ, మినీ మథుర్​, నేహా థూపియా వంటి ప్రముఖులు హాజరయ్యారు.

కత్రినాకైఫ్​

మ‌రోవైపు కత్రినా , విక్కీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసిన వెంటనే, అలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్, దీపికా పదుకొనే, అనుష్క శర్మ, హృతిక్ రోషన్, సిద్ధాంత్ చతుర్వేది, అలీ అబ్బాస్ జాఫర్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్, పరిణీతి చోప్రా, జాన్ టైగర్ ష్రాఫ్ కపూర్‌ల‌తో పాటు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారి వారి స్టైల్ లో విసెష్ తెలిపారు.

Related posts