telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో బ్రేక్..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోను బాలయ్య తనదైన స్టైల్‌లో టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఫస్ట్ సీజన్ ముంగిపు దశకు చేరుకుంది. దీనిపై ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా సమాచారం అందించారు . ఇప్ప‌టివ‌ర‌కు ఈ టాక్‌ షో 8 ఎపిసోడ్లతో మొద‌టి సీజన్ పూర్తి చేసుకోనుంది.

Nani is the second guest: Unstoppable with Balakrishna – Promo today evening

బాలయ్య టాక్ షో అనగానే భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు.  ఈ షోకు వచ్చిన గెస్ట్ లపై ప్రశ్నలు వర్షాలు కురిపిస్తూనే తనదైన శైలీతో నవ్వులు పూయిస్తున్నారు బాలయ్య.

Balakrishna's Unstoppable to have 'Icon'ic treat?

టాక్ షో అంటే ఏదో నాలుగు గొప్పలు మాట్లాడుకొని, డిప్లొమాటిక్ సమాధానాలతో ముగించడం కాదని కొత్త భాష్యం చెప్పారు. జనాల్లో నలుగుతున్న కాంట్రవర్సీలకు క్లారిటీ ఇవ్వడం ద్వారా.. షోకి సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టారు. 

Unstoppable: Mahesh - Balakrishna Episode Seals OTT Release Date

ఇప్పటివరకు ఈ షోకు చాలామంది గెస్ట్ లు హాజరయ్యారు. మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, బోయపాటి శ్రీను అఖండ టీమ్, దర్శక ధీరుడు రాజమౌళి లతో 5 ఎపిసోడ్లు అలరించిన బాలయ్య 6 వ ఎపిసోడ్ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న అల్లు అర్జున్ తో సందడి చేయనుండగా.. 7 వ ఎపిసోడ్ డిసెంబర్ 31 న మాస్ మహారాజ రవితేజ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Balakrishna and Ravi Teja: Balakrishnaa's rifts with Ravi English OKTelugu

ఇక ఈ సీజన్ ఆఖరి ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాలయ్య సందడి చేయనున్నారు. సీజన్ ఫినాలే సూపర్ స్టార్ తో నట సింహం బాలకృష్ణ అంటూ ఆహా పోస్టర్ రిలీజ్ చేసింది. ” రాసి పెట్టుకోండి.. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ల సందడి కనువిందు చేయనుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది.

మరి ఈ షోలో మహేష్, బాలయ్య మధ్య ఎలాంటి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తాయనే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.

Related posts