telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలయ్య సినిమాకు మరో కొత్త టైటిల్..?

NBK

బాలయ్య-బోయపాటి అప్ కమింగ్ మూవీ బీబీ3కి టైటిల్ ఫిక్స్ అయ్యిందని మరో వార్త హల చల్ చేస్తుంది.  అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య నుంచి వారి అభిమానులు ఏదైతో కోరుకుంటారో.. బోయపాటి తొలి టీజర్‌తోనే అందించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ అంటూ కొన్ని పేరు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ సినిమా ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో పేర్లు వెలుగు చూశాయి. మోనార్కా, ధర్మా వంటి పేర్లు ఈ సినిమాకు ఫైనల్ చేశారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పవర్‌ఫుల్ గాడ్‌ఫాదర్ టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేశారని, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ టైటిల్ బాలయ్య సినిమాకు సరిగ్గా సూటవుతుందని బోయపాటి భావిస్తున్నాడట. టైటిల్ ను దాదాపుగా ఫైనల్ చేసినట్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సినిమా మే28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts