telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు భారీ ఊరట…

salman khan getting 200cr remuniration from

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాధే సినిమా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత సల్మాన్ అంతిమ్ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాను మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఓ సిక్కు పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయుష్ శర్మా గ్యాంగ్ స్టర్ పాత్రలో చేస్తున్నారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ కు ఇన్నాళ్ళకు ఉపశమనం లభించింది. ఆయన పై కృష్ణ జింకల వేట కేసులో రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను జోధ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దాంతో ట్విట్టర్ వేదికగా అభిమానులకు వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు సల్మాన్. 2003 కి సంబంధించిన కేసులో భజరంగీ భాయ్ జాన్ పై వచ్చిన పిటిషన్లు కొట్టివేశామని జడ్జి రాఘవేంద్ర కచ్వాల్ సారథ్యంలోని బెంచ్ చెప్పగానే బెంచ్ కి ధన్యవాదాలు తెలిపాడు సల్మాన్ ఖాన్. ఈ కేసులో సల్మాన్ దోషిగా నిరూపితమై ఉంటే సెక్షన్ 193 కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడిఉండేది. `హమ్ సాథ్ సాథ్ హైన్` చిత్రం షూటింగ్ సమయంలో జోధ్ పూర్ సమీపంలో కంకని గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని వేటాడాడనే కారణంగా ఖాన్ అరెస్టయ్యాడు. గురువారం ఈ కేసులో సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని తీర్పు రావటంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Related posts