telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

పొన్నం ప్రభాకర్ .. పదవికే రాజీనామా..

ponnam prabakar resignation

తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా తమ పదవులకు రాజీనామా చేస్తుండటం అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇప్పటికే తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఆయన తన కార్యకర్తలతో సమావేశమవుతుండటం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోంది. అయితే తాజాగా కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సడెన్‌గా తన పదవికి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా 140 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.

Related posts