telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం

నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి మరో రెండు రోజుల్లో కానుంది. డిసెంబర్‌ 9న ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ వేదికగా చైతన్య-నిహారికల పెళ్లి వేడుక జరుగనుండగా… ఈ శుభకార్యానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానున్నారు. ఇక ఆదివారం నిహారికని పెళ్లికూతురుని చేసే కార్యక్రమం జరగగా దీనికి చిరంజీవి తన సతీమణి సురేఖతో హాజరయ్యారు. తన కూతురికి ఆశీర్వాదం అందించి ఆ తర్వాత సెల్ఫీ దిగారు చిరు. ఆ ఫోటోలో నిహారిక, చిరంజీవి మెరిసిపోతున్నారు. ఇదే ఫోటోని నాగబాబు తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. చిరు ప్రేమకు సరిహద్దులు ఉండవు, అతని చిరునవ్వు ప్రతి సంఘటనను ఒక వేడుకలా మారుస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిహారిక పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు వెంకట చైతన్యతో ఈ నెల 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో జరుగనుంది. ఇక రిసెప్షన్‌ డిసెంబర్‌ 11న హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగనుంది.

Related posts