telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఒక్క షో … ఆరునెలలే నిడివి.. 600పైగా కార్మికులకు భుక్తి..

bigg boss 3 hindi show started

ఒక్క టీవీ షో కోసం భారీ సెట్టింగ్, దానికోసం భారీగా కార్మికులు ఆరు నెలలు శ్రమపడ్డారు. అదే బిగ్‌బాస్ సీజన్-13(హిందీ), గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ కోసం ఈసారి హౌస్ సెట్‌ను ముంబైలోని ఫిల్మ్ సిటీలో తీర్చిదిద్దారు. ఇంతకుముందు లోనావాలాలో రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ ఓమంగ్ కుమార్ బిగ్‌బాస్ హౌస్‌కు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఈసారి బిగ్‌బాస్ హౌస్ లో ప్లాస్టిక్‌ను వినియోగించలేదు. దీనికి బదులుగా పీఓపీ, ఇతర మెటీరియల్ ఉపయోగించారు. అయితే ఇందుకోసం అధికంగా వ్యయమైంది. అయితే నిర్వాహకులు ఖర్చుకు వెనుకాడకుండా పర్యావరణ హితాన్ని కోరుతూ, స్ఫూర్తిదాయక సందేశాన్ని సమాజానికి అందించారు.

బిగ్‌బాస్ హౌస్ రూపకల్పనలో 600 మంది కార్మికులు పాలుపంచుకున్నారు. వీరంతా 6 నెలల పాటు శ్రమించి హౌస్‌ను తీర్చిదిద్దారు. ఇంటి ఫినిషింగ్ కోసమే 60 రోజులు పట్టింది. ఈసారి హౌస్ ను మ్యూజియం థీమ్‌తో రూపొందించారు. హౌస్‌లో మొత్తం 93 కెమెరాలను అమర్చారు. అలాగే మొత్తం 14 బెడ్‌లను ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ హాలులో అద్భుతమైన దీవాన్ ఏర్పాటు చేశారు. ఇంటిలోని ప్రతీ అణువణువునూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Related posts