telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన అందాలతో కాక పుట్టిస్తున్న రష్మిక…

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్‌ని అతిత్వరలో తిరిగి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఈ సారి క్రేజీ స్టెప్ వేసేందుకు రెడీ అయిందట. ఇకపై తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునేలా ప్లాన్ చేస్తోందట రష్మిక. అయితే.. తాజాగా ఈ భామ జిమ్‌లో ఉన్న తన ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోల్లో రష్మిక చాలా అందంగా కనిపిస్తోంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Related posts