యంగ్ హీరో శర్వానంద్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర యూనిట్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన టైటిల్ పోస్టర్లు, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. నిన్న లిరికల్ సాంగ్ ప్రోమోన్ రిలీజ్ చేయగా.. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది.
‘హె లక్ష్మమ్మో.. పద్మమ్మో.. శాంతమ్మో.. శారదమ్మో.. గౌరమ్మో.. క్రిష్ణమ్మో.. నా బాధే వినవమ్మో.. ఈ గోలే ఏందమ్మో.. ఇగోలే వద్దమ్మో.. ఓ లమ్మో.. నాబతుకే బుగ్గయ్యేనమ్మో.. ఆడాళ్లు మీకు జోహార్లు.. ఆడాళ్లు మీకు జోహార్లు’ అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఈ మూవీలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను బట్టి చూస్తే ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా కనిపిస్తోంది.
శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానల్… రచ్చ మొదలైంది