telugu navyamedia
సినిమా వార్తలు

గంగూబాయి కతియావాడీ ట్రైలర్‌ విడుదల

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ హీరోయిన్‌ తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడీ. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముంబయికి చెందిన‌ మాఫీయా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారు.

తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. “కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా వెలుగు ఉంటుంది ఎందుకంటే అక్కడ గంగూబాయ్‌ ఉంటుంది” అని అజయ్‌ దేవ్‌గణ్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ ఆకట్టుకునేలా ఉంది.

ఇందులో అలియా తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఒకవైపు డాన్‌గా సీరియస్‌లుక్‌లో కనిపిస్తూనే మరోవైపు ఫన్నీ డైలాగ్‌లతో నవ్వించింది.

‘మీకు నా మాటలు అభ్యంతకరంగా అనిపించవచ్చు. కానీ మీకంటే ఎక్కువ గౌరవం మాకే ఉంది. ఎందుకంటే.. మీరు ఒక్కసారి మర్యాద పోగొట్టుకుంటే మొత్తం పోయినట్లే. కానీ మేము ప్రతి రోజూ రాత్రి మా గౌరవాన్ని అమ్ముకుంటాం. కానీ మా గౌరవం ఎప్పటికీ పోదు’ అని చెప్పే అలియా చెప్పే డైలాగ్‌లు సినిమాపై అంచనాలు మ‌రింత‌ పెంచేశాయి.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Related posts