telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గని షూటింగ్ లో పాల్గొన ఉపేంద్ర…

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బాక్సింగ్‌ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్‌ లుక్‌ అభిమానులను ఎంతగానో అలకరించింది. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తున్నట్లు టాక్‌.ఈ మూవీలో కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర నటిస్తున్నాడు. కానీ వరుణ్‌ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే నేడు ఉపేంద్ర గని చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ మేరకు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్పోర్ట్స్ డ్రమాలో ఉపేంద్ర పాత్ర సినిమాకే చాలా ముఖ్యమని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా జూలై 30వ తేదీన థియేటర్లోకి రాబోతున్నట్లు ఇంతకముందే తెలిపింది చిత్రబృందం. కానీ ఇప్పుడు చెప్పిన తేదికి కాకుండా సెప్టెంబర్ లో విడుదల చేయాలనీ చుస్తున్నారంట.. ఎందుకంటే.. ఈ సినిమా జులై 30 వ విడుదల అయితే ఆ తర్వాత త్వరగా కేజీఎఫ్2, రాధేశ్యామ్, పుష్ప సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో గని వెనక్కి వెళ్లాలని చూస్తుంది.

Related posts