telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జబర్దస్త్‌ యాంకర్‌కు స్వాగతం పలికిన ఖిలాడీ టీం !

టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. ప్రస్తుతం రవితేజా చేస్తున్న సినిమా ఖిలాడీ. ఈ సినిమా పోస్టర్ ఈ మధ్యే రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు.  పక్కా యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇటీవల టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ చేరారు. అయితే నేడు తెలుగు హాట్ యాంకర్ అనసూయ కూడా ఖిలాడి సెట్స్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ ఖిలాడి టీం పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర చేయనున్నారంట. కానీ ఆమె చేసేది ఏ పాత్ర అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం మాస్ మహరాజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related posts