telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా టీకా తీసుకున్న మంత్రి ఈటల…

దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ ఇవాళ ఉదయం 10 గంటల నుంచే ప్రారంభం అయింది. రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు, 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికీ వ్యాక్సిన్ ను అందించబోతున్నారు. అయితే.. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోగా… తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ లేదన్నారు. అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి భయం అవసరం లేదని భరోసా కల్పించారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. వ్యాక్సిన్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ అందుబాటులో ఉంటుందని ఈటల పేర్కొన్నారు.

Related posts