ప్రముఖ తమిళ నటి వనితా విజయ్ కుమార్ తమిళ బిగ్‌బాస్ 3లో పాల్గొని బాగా పాపులర్ అయింది. ఆమె తాజాగా తన మూడో పెళ్ళితో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈ నెల 27న వివాహాం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ పెళ్లి విషయమై వనిత ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. వనితా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే అతనితో మనస్పర్థల కారణంగా 2005లో ఆకాశ్ నుండి విడిపోయింది.ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే బిజినెస్ మేన్‌ను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. తెలుగులో కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాలో నటించింది.
previous post