telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాలో 6 మిలియన్ మార్కును దాటిన నాగ్, రానా

Tollywood

సీనియర్ హీరో నాగార్జున సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో నాగ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా నాగార్జున ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది.ఈ సందర్భంగా నాగార్జున తన అభిమానులకు మరియు ట్విట్టర్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దగ్గుబాటి వారబ్బాయి రానా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రానా ఫాలోయింగ్ కూడా మాములుగా లేదు. రానా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీలు తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు తమ సినిమాకు సంబందించిన అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Related posts