telugu navyamedia
సినిమా వార్తలు

సాయి ధరమ్ తేజ్ కేసులో నిజాలు ఇవీ!

నిన్న రాత్రి రేసింగ్ బైక్ స్కిడ్ అయ్యి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డ విషయం విదితమే. ఇందులో పోలీసుల ప్రాధమిక విచారణలో పలు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.

Sai Dharam Tej Turns Writer

సిసి టివీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట కేబుల్ బ్రిడ్జిపైన సాయి ధరమ్ తేజ్ వాహనం గంటకు 100 కిలోమీటర్ల వేగంకన్నా ఎక్కువగా పయనిస్తున్నట్టు, ఆక్సిడెంట్ సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగానికి పైగా ఉన్నట్టు తేలింది కేబుల్ బ్రిడ్జి పైన అనుమతించిన వేగం గంటకు 40 కిలోమీటర్లు కాగా, ఆక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో గంటకు 30 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. ట్రైంఫ్ కంపెనీ రేసింగ్ బైకును ఎల్బీనగర్‌కు చెందిన బూర అనిల్ కుమార్ దగ్గర కొన్నాళ్ల క్రితం కొనుగోలు చేసిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకూ అది తనపేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.

Road accident today: Latest news, photos and videos on road accident today

ఇదే బైక్ మీద గత ఏడాది అధిక వేగంతో డ్రైవ్ చేసినందుకు రు. 1135 పెండింగ్ చలాన్ ఉన్నది. దీన్ని ఇవ్వాళే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెల్లించారు. ఇది ఎవరు చెల్లించారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక విచారణలో ఇప్పటి వరకూ అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తరువాత ఈ ఆక్సిడెంట్ ప్రధానంగా అతి వేగంగా నడపడం, నిర్ల్యక్ష్యపూరిత డ్రైవింగ్ వల్లనే జరిగింది అని నిర్ధారణకు వచ్చిన పోలీస్ శాఖ.

Sai Dharam Tej says, My bride may not approve my service - tollywood

అయితే ..ఆ గుర్తు తెలియని వ్యక్తికి తేజ్ కి సంబంధం ఏంటి.. ఈ బైక్ చలానా హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్థితుల్లో నమోదైందా.. లేదా ఏదైనా రేసింగ్ కేసులో చలానా విదించారా అనేది తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి ఆచూకీ లభ్యమైతే ఎవరు, ఎందుకు కట్టారనే విషయంపై కూపీ లాగే అవకాశం ఉంది.

Related posts