telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : రాహుల్ ను నామినేట్ చేసిన పునర్నవి

Bigg-Boss

బిగ్ బాస్ సీజ‌న్-3 ప్రారంభ‌మై ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో ఇప్పటికే నాలుగు ఎలిమినేష‌న్స్ పూర్త‌య్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌, మూడవ వారం తమన్నా సింహాద్రి, ఇక నాలుగవ వరం రోహిణి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఐదో వారంలో జరగబోయే ఎలిమినేషన్ కి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఇంటిలో కొనసాగడానికి అనర్హులు అనుకునేవారికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో గొడవ మొదలైంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ పునర్నవి, రాహుల్ కి రంగు పూసి నామినేట్ చేసింది. ఈ నామినేషన్ ప్రాసెస్ లో పునర్నవి-హిమజల మధ్య సీరియస్ డిస్కషన్స్ జరుగుతోంది. అషు రెడ్డి కూడా శ్రీముఖిపై ఫైర్ అయింది. హిమజ, అషులకు మధ్య కూడా రచ్చ జరిగినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. మరి ఈ వారం ఎలిమినేషన్ కి ఎవరు నామినేట్ కాబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.

Related posts