telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అశ్వత్థామరెడ్డిపై .. మరోకేసు నమోదు..

tsrtc union president aswathamareddy on kcr

ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డిపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. ఆయనతో పాటు ఆర్టీసీ జేఏపీ కో కన్వీనర్ రాజిరెడ్డిలపై మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఉదృతంగా సాగిన సమ్మెను..జేఏసీ నేతలు నీరుగార్చుతున్నారని దీపక్ కుమార్ ఆరోపించారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక..విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గడం ఏంటని ప్రశ్నించారు.

విలీనం పై అందరితో చర్చించే ప్రతిపాదనను వాయిదా వేశారా అని కుమార్ ప్రశ్నించారు. జేఏసీ నేతలు వేస్తోన్న అడుగులు చూస్తుంటే..వారు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. దాదాపు 50,000 మంది ఆర్టీసీ ఉద్కోగులు, కార్మికులు తన జీతభత్యాలను వదులుకోని, అనేక కష్టాలకోర్చి సమ్మె చేస్తుంటే..ఉద్యమ నేతలు తీరు బాధ కల్గిస్తుందని దీపక్ కుమర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే వరకు ఆర్టీసీ కార్మికుల పక్షాన మాల మహానాడు, బంజారా, ఎమ్మార్పీఎస్, గిరిజన, మైనారిటీ సంఘాలు మద్దతుగా నిలిస్తాయని తెలిపారు.

Related posts