telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగర్ సునీత మ్యారేజ్‌ ముహుర్తం ఖరారు…!

సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి సర్వ సాధారణం. అయితే తాజాగా… సింగర్ సునీత కూడా కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం కూడా రహస్యంగా జరిగింది. అనంతరం ఆమె పెళ్లి చేసుకుంటున్నానని అధికారికంగా ప్రకటించింది. ఇక ముందు ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే.. తాజాగా వీరిద్దరి పెళ్లిపై మరో వార్త బయటకు వచ్చింది. జనవరి 9న సునీత, రామ్‌ వీరపనేని వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే..కరోనా నేపథ్యంలో పెళ్లికి కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్మానించనున్నారని టాక్‌. జనవరి 9న వీరిద్దరి పేరుపై మంచి ముహుర్తం ఉండటంతో…మళ్లీ ఈ ముహుర్తం దాటితే మంచి రోజులు లేకపోవడంతో అదే తేదీని ఫిక్స్‌ చేసేశారట.  అయితే..దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.. 

Related posts