ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌పై ఆర్డినెన్స్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని… బడ్జెట్ సమావేశాలంటే సీఎం జగన్‌కు భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ పేర్కొన్నారు. బడ్జెట్‌పై ఆర్డినెన్స్ ఇవ్వడం పలాయనవాదమని, దివాలా కోరుతనమని ఆయన మండిపడ్డారు. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే దుష్ట సాంప్రదాయాన్ని జగన్ తీసుకువచ్చారని… ప్రజలన్నా, ప్రతిపక్షమన్నా, చట్టసభలన్నా ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు యనమల. బడ్జెట్ వాయిదా వేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని ఫైర్ అయ్యారు. గతంలోనూ మొక్కుబడి బడ్జెట్ తేవాలని చూస్తే మండలి వ్యతిరేకించిందని.. తిరుపతి లోక్‌సభ, పరిషత్ ఎన్నికల సాకుతో తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు యనమల. కాగా.. ఒకటి రెండు రోజుల్లో బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. సీఎం జగన్ వద్ద బడ్జెట్ ఆర్డినెన్స్ ఫైల్… మూడు నెలల కాలానికి బడ్జెట్ ఆర్డినెన్స్ రూపొందించనున్నారు. రూ. 80 నుంచి 90 వేల కోట్లతో మూడు నెలల బడ్జెట్ రూపొందించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. నవరత్న పథకాల అమలుకు నిధులతో బడ్జెట్ ఆర్డినెన్స్ సిద్దం చేసినట్టు సమాచారం అందుతోంది.అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్టుని ఆమోదించనున్న ప్రభుత్వం.
previous post