జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత, ఆ రాష్ట్రంలో ఇంతవరకూ ఒక్క తుపాకి కూడా పేలలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని, పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించామని వెల్లడించారు. ఒకటి రెండు ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు నమోదయ్యాయని, సైనికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆందోళకారులను చెదరగొట్టారని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ వార్తలను మీడియా ప్రసారం చేయాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో దిల్ బాగ్ సింగ్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యల తరువాత నిమిషాల్లోనే జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ లో దిల్ బాగ్ స్టేట్ మెంట్ ను ఉంచింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ విద్వంస ఘటనలు నమోదు కాలేదని ఆయన అన్నారు. ప్రజలు ఎవరూ ఊహాజనిత వార్తలను, వైరల్ అయ్యే వార్తలను నమ్మవద్దని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి