telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఖరారు.. ఒక్కదానికే భారీ పోటీ … !

25laks houses by ugadi apcm

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. పార్టీ కీలక నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలతో నిన్న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని, కరణం బలరాంలు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కనుండడంతో ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని, మిగిలిన ఒక్క స్థానం విషయంలోనే తర్జనభర్జన జరుగుతోందని సమాచారం. మంత్రి మోపిదేవి వెంకటరమణ, హిందూపురంలో బాలకృష్ణపై పోటీచేసి ఓడిపోయిన ఇక్బాల్‌ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానానికి మాత్రం మర్రి రాజశేఖర్, పండుల రవీంద్ర, ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. మరి అధినేత ఆశీర్వాదం ఎవరికో చూడాలి.

Related posts