telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పరమ చెత్త క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన తల్లిదండ్రులు… పాప రియాక్షన్ చూసి షాక్

Baby

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జస్టిస్ మోజికా తన రెండేళ్ల పాప అరియాకు క్రిస్మస్ కానుకగా ఓ అరటి పండును ప్యాక్ చేసి ఇచ్చారు. వాస్తవానికి ఆ గిఫ్ట్ చూసి అరియా తమను కోపగించుకుంటుందని ఆయన భావించారు. కానీ ఆమె పట్టలేనంత సంతోషంతో్ దాన్ని స్వీకరించడం చూసి మోజికా, ఆయన భార్య ఆశ్చర్యపోయారు. దీని తాలూకు వీడియోను జస్టిస్ మోజికా ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. ‘‘క్రిస్మస్ సందర్భంగా నా కుమార్తెకు ఓ వరస్ట్ గిఫ్ట్ ఇద్దామని ప్రయత్నించాను. అయితే ఆమె నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని అస్సలు ఊహించలేదు..’’ అని పేర్కొన్నారు. సదరు ఫ్రాంక్ గిఫ్ట్‌ను తెరిచి చూడగానే.. ‘‘బనానా.. దాన్ని ఒలిచివ్వు..’’ అంటూ ఆ చిన్నారి పడిన సంబరంపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పోస్టు చేసిన నాలుగు రోజుల్లో 23 మిలియన్ల మంది ఈ వీడియో వీక్షించారు. 1.5 మిలియన్ల మంది లైక్ చేశారు.

Related posts