చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. చంద్ర, హరిలు హీరోలుగా అక్షఖాన్ హీరోయిన్‌గా చిగురుపాటి సుబ్రమణ్యం రచన, సాహిత్యం, స్క్రీన్‌ప్లేతో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ‘ఓ అందగత్తె ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్. 175 మందికి పైగా కొత్త వారితో, ఐదుగురు ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లతో నిర్మించిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ మహానటి ఫేం, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో అత్యంత భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్‌ను చిత్ర యూనిట్ మేళ,తాళాలతో వేదిక వద్దకు తోడ్కొని వచ్చి, గజమాలతో సత్కరించారు.
అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…
చిగురుపాటి సుబ్రమణ్యం నా దగ్గర ఓ వెబ్ సిరీస్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పటి నుంచి నాతో చాలా స్నేహంగా ఉంటాడు. ఈ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఇంతకు ముందు ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. టీం అందరూ ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమౌతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ గొప్ప లైఫ్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరోయిన్ అక్షఖాన్ మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత సుబ్రమణ్యం గారికి థ్యాంక్స్. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చి, టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నాగ్ అశ్విన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇందులో పక్కా మాస్ మిక్సింగ్ క్యారెక్టర్ చేశాను. అలాగే నన్ను గత మూడు సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్న సురేష్ కొండేటి గారికి థాంక్స్. ప్రేక్షకులు అందరూ మా మూవీకి సపోర్ట్ చేయాలని యూనిట్ తరపున కోరుకుంటున్నా అన్నారు.
హీరో ఎం.ఎస్. చంద్ర మాట్లాడుతూ…
మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన నాగ్ అశ్విన్ గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిగురుపాటి సుబ్రమణ్యం గారికి థ్యాంక్స్. ఆయన మా దర్శకుడు అనడం కన్నా.. గురువు అంటేనే బాగుంటుంది అన్నారు.
మరో హీరో హరి మాట్లాడుతూ…
నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సుబ్రమణ్యం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. అందరం చాలా కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులు సూపర్‌హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
ఈ సినిమాకు సురేష్ కొండేటిని పీఆర్వోగా పెట్టడంలోనే సగం సక్సెస్ అయ్యారు. సురేష్ పెద్ద సినిమాలు మాత్రమే చేస్తాడు. చిన్న సినిమాలు సహజంగా చేయడు. ఒకవేళ చిన్న సినిమాకు పీఆర్వోగా చేయాల్సి వస్తే.. దాన్ని పెద్ద సినిమా రేంజ్‌కు తీసుకు వెళ్లిపోతాడు. నాగ్ అశ్విన్ గారు ఈ సినిమా వేడుకకు రావడంతో ఇది పెద్ద సినిమా రేంజ్‌కు వెళ్లిపోయింది. టీజర్ చూసిన తర్వాత వీళ్లంతా ఎంత కష్టపడ్డారో అర్ధమౌతోంది. తప్పకుండా దర్శకుడు చిగురుపాటికి పెద్ద బ్యానర్స్ నుంచి త్వరలోనే అవకాశం వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు.
దర్శక, నిర్మాత చిగురుపాటి సుబ్రమణ్యం మాట్లాడుతూ…
మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన నాగ్ అశ్విన్ గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేం అడగ్గానే వచ్చినందుకు ఆయనకు జన్మంతా రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి నాతోపాటు యూనిట్ మొత్తం చాలా కష్టపడిరది. సంవత్సరకాలంగా మాకు ఈ సినిమానే జీవితం అయిపోయింది. ఈ సినిమాకు డైరెక్టర్ నుంచి బాయ్ వరకూ అన్ని పనులనూ నేను చేశాను. ఇందులో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ డబ్బులు ప్రధానంగా చూడకుండా పనిచేశారు. ఇందుకు వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు ఈ ఈవెంట్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకోలేదు. సురేష్ కొండేటి గారు అనుకోకుండా ప్లాన్ చేశారు. సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం మాకు చాలా సహకరించింది. ఈ సినిమాను ఆదరించండి… తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే తీస్తాను. మొత్తం 5 పాటలు, 6 ఫైట్‌లు ఉంటాయి. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ తమ స్వంత సినిమాగా భావించి పనిచేశారు. ఇంతమంది ఇంత ప్రేమతో చేసిన ఈ ‘నెల్లూరి నెరజాణ’ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: గోపి, సంగీతం: యారచల వెంకటేష్, ఎడిటర్: దువ్వరపు వెంకటేష్, కొరియోగ్రఫీ: సాగర్`రవి, ఫైట్స్: దేవరాజ్, పి.ఆర్.ఓ.: సురేష్ కొండేటి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సాహిత్యం, నిర్మాత, దర్శకత్వం: చిగురుపాటి సుబ్రమణ్యం.