telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్​ఆర్​ఆర్’​ నుంచి ‘కొమురం భీమ్’​ కొత్త పోస్టర్ రిలీజ్‌

యంగ్ టైగ‌ర్ జూ. ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు.

Ramaraju For Bheem Sets Rare Feat

ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు.

RamarajuForBheem: Jr. NTR Powers Through Two Period Looks As Bheem In SS  Rajamouli's RRR, Co-Starring Ram Charan

బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, ‘దోస్తీ’, ‘నాటు నాటు’, ‘జనని’ పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Thumbnail image

ముందుగా ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది.కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 

ఈ క్ర‌మంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ పోషిస్తున్న భీమ్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. సాయంత్రం 4 గంటలకు రామ్‌చరణ్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఈ పోస్టర్ విడుదల అయిన కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts