telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సీటీమార్ టైటిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి న‌టిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేసారు. దాంతో సినిమా పై అభిమానులు మరింత అంచనాలు పెంచుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది.

Related posts