telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్లు తీస్తూ బాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోకుండా చేసి పంజేబ్ ను దెబ్బ కొట్టారు. అయితే పంజాబ్ తరపున ఈ ఇన్నింగ్స్ లో అత్యధికంగా మయాంక్ అగర్వాల్,షారుఖ్ ఖాన్ ఇద్దరు 22 పరుగులు చేసారు. దాంతో ఆ జట్టు నిర్ణిత 19.4 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలిపోయింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా అభిషేక్ శర్మ రెండు, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే హైదరాబాద్ 121 పరుగులు చేయాలి. అయితే హైదరాబాద్ ఓడిన గత మ్యాచ్ లలో కూడా చేధనలోనే తడబడింది. మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది అనేది చూడాలి.

Related posts