telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

డేటింగ్ యాప్ లతో ఆ యువకుడు ఏం చేశాడంటే…?

dating

నార్త్ కాలిఫోర్నియాకు చెందిన 20 ఏళ్ల హకీం డొపార్కర్ అనే యువకుడు డేటింగ్ యాప్‌ల ద్వారా తనను తాను యువతిగా పరిచయం చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఘటన తాజాగా నార్త్ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. డేటింగ్ యాప్స్‌లో మొదట అందమైన యువతుల ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువకులకు డేటింగ్ ప్రపొజల్ పెట్టేవాడు. వారు ఒప్పుకుంటే తాను చెప్పిన చోటుకు రమ్మని చెప్పేవాడు. అనంతరం బాధితులను శాన్ ఫ్రాన్సిస్కొకు 72 కిలోమీటర్ల దూరంలో గల ఆంటియోచ్ అనే ప్రాంతానికి పిలిచేవాడు. ఆ తరువాత బాధితులు అక్కడికి రాగానే వెనక నుంచి వారి మెడపై కత్తి పెట్టి తెచ్చిన నగదు, వాహనాల తాళాలు ఇవ్వాలని బెదిరించేవాడు. దాంతో బాధితులు భయపడి అతడికి నగదుతో పాటు తాము వచ్చిన వాహనం తాళాలను అప్పగించేవారు. ఇలా జూన్‌ నెలలో నలుగురిని బెదిరించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, రెండు కార్లను ఎత్తుకెళ్లాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కాంట్రా కొస్తా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ పోలీసులు మంగళవారం డొపార్కర్‌ను ఆంటియోచ్‌లో అదుపులోకి తీసుకుని, న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం అక్కడి న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.

Related posts