telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీలో వేడుక…?

Niharika

మెగా ప్రిన్సెస్ నిహారిక గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహ నిశ్చితార్థం ఆగస్టులో జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. పెళ్లి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరపాలనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆగస్టులో నిహారిక చైతన్యల నిశ్చితార్థం జరుగబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. వరుణ్ తేజ్ తాజాగా ఒక సందర్బంలో ఆగస్టులో ఇంట్లో ఒక వేడుక ఉంది అన్నాడు. అంటే ఆ వేడుక నిహారిక నిశ్చితార్థం అయ్యి ఉంటుందని అంతా కన్ఫర్మ్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు చైత‌న్య‌ని నిహారిక వివాహం చేసుకోనుండ‌గా, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలిసింది.

Related posts