బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం తాజాగా ఓ సినీ వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యింది. ఇటీవల పునర్నవి యోగా చేస్తూ ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పునర్నవి హాట్ యోగా అంటూ ఈ వీడియోలు బాగా వైరల్ కావడంతో నా పర్మిషన్ లేకుండా నాపై ఇలాంటి చెత్త ఆర్టికల్స్ ఎలా రాస్తారు ? అంటూ సదరు వెబ్ సైట్‌పై ఫైర్ అవుతూ.. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది పునర్నవి. నాతో పాటు చాలామంది ఇండస్ట్రీకి చెందిన మహిళల్ని కించపరుస్తూ సెక్సీ, హాట్ అంటూ పనికిమాలిన ఆర్టికల్ తరచుగా పెడుతున్నారు. మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు అంటూ ఫైర్ అయ్యింది పునర్నవి.
‘అది పొగడ్తే కదా.. సెక్సీగా కనిపించడానికి చాలామంది ఇలాంటివి చేస్తారు. ఆ పోస్ట్‌లో తప్పేం ఉంది?? లేక నేను ఏదైనా మిస్ అయ్యానా?? అంటూ ఓ నెటిజన్ పునర్నవి పోస్ట్‌పై కామెంట్ చేశాడు. దీనిపై పున్నూ సీరియస్‌గా స్పందిస్తూ.. ‘మీరు అనుమతి అనే విషయం విన్నారా ? నా గురించి ఎన్ని వెబ్ సైట్ తప్పుగా వార్తలు రాస్తున్నాయో తెలుసా?? ఒక మహిళ ధరించిన వస్త్రధారణ గురించి ఆమెను కించపరడం.. అసభ్యకరంగా ప్రవర్తించడం సరైనదే అని మీరు భావిస్తున్నారా?? దీన్ని బట్టి మీరు తక్కువ చదువుకున్నారని అర్థమౌతోంది. మీ ఇంట్లో తల్లీ, సోదరీమణులు ఉన్నారనే అనుకుంటున్నాను. బహుశా ఉంటే.. మీరు నా బాధను అర్థం చేసుకుంటారు. నాపై ఇలాంటి అటెన్షన్ నాకు నచ్చలేదు. దీన్ని నేను ఎప్పుడూ అడగలేదు కూడా’ అంటూ ఘాటుగా స్పందించారు పునర్నవి. ఇక సదరు వెబ్ సైట్ ఆమెకు సారీ చెప్తూ.. ఆ ఆర్టికల్‌ని తొలగిస్తాం అని ఫేస్ బుక్ మెసేంజర్‌లో మెసేజ్‌లు పెట్టినా శాంతించలేదు పునర్నవి. వారు తనతో చేసిన చాట్ స్క్రీన్ షాట్స్‌ని కూడా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది పునర్నవి. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది ఆమెను సమర్థిస్తుండగా… మరికొంతమంది మాత్రం అందులో తప్పేం ఉంది.. మీరు చూపించారు వాళ్లు రాశారు అంటూ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.
ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…