telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ హాసన్, త్రివిక్రమ్ లకు మహేష్ బర్త్ డే విషెస్

mahesh-babu

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు..లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఓ ఈవెంట్‌లో క‌మ‌ల్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. “లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాసన్ గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఏ పాత్ర‌లోనైన ఇట్టే ఒదిగిపోయే జీనియ‌స్.. మా అందరికి ఇన్సిపిరేష‌న్ అయిన క‌మ‌ల్‌.. ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాల‌ని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు మహేష్. ఇక త్రివిక్ర‌మ్ కు కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు మ‌హేష్. “హ్యాపీ బ‌ర్త్ డే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. మీరు ఎల్ల‌ప్పుడు మంచి విజ‌యాలు సాధించాల‌ని, ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా సినీ ప్రముఖులు విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్, లేడిసూప‌ర్ స్టార్ అనుష్క, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ బ‌ర్త్‌డే ఈ రోజు (న‌వంబ‌ర్ 7). ముగ్గురు ప్ర‌ముఖుల బ‌ర్త్‌డే ఒకే రోజు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో వీరికి బ‌ర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఈ ముగ్గురికి ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Related posts