telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … అశ్వత్థామరెడ్డిపై .. ఉద్యోగి కేసు నమోదు..

tsrtc union president aswathamareddy on kcr

కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదైంది. కూకట్‌పల్లి డిపో డ్రైవర్‌ కోరేటి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 341, 506 సహా సెక్షన్‌ 7 కింద కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకు అశ్వత్థామరెడ్డే కారణమని రాజు తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికుల్లో ఆయన విషం నింపుతున్నారని ఆరోపించారు.

విలీన డిమాండ్‌ కార్మికులది కాదని.. అది అశ్వత్థామరెడ్డి వ్యక్తిగత కోరికని పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కూకట్‌పల్లి సీఐ లక్ష్మినారాయణకు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు. దీని వెనుక కేసీఆర్ ఉన్నట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పలువురు విమర్శిస్తున్నారు. కోర్టు కూడా వాయిదాలు తప్ప చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.

Related posts