telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు గుడ్‌న్యూస్ః భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు…

బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. దీంతో మన దేశంలో బంగారం ధరలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. అందుకే కరోనా టైంలోనూ బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 49,630 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 240 తగ్గి రూ. 45,500 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.75,900 వద్ద కొనసాగుతోంది.

Related posts