telugu navyamedia
తెలంగాణ వార్తలు

మోదీజీ..దమ్ముంటే తెలంగాణలో ‘షిండే’ను దించండి… మాతో గోక్కుంటే అగ్గే

మహరాష్ట్ర లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందని కమలం నాయకులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సమర్ధవంతమైన, సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్‌ను ఏక్‌నాథ్‌ షిండేలు, కట్టప్పలు ఏమీ చేయలేరని హెచ్చరిస్తూనే బీజేపీకి కేంద్రంలో కూడా నూకలు చెల్లిపోయాయంటూ రివర్స్ అటాక్ చేశారు. విశ్వగురువుగా చెప్పుకునే మోదీ బ్యాంకులను లూటీ చేసే దొంగలకు విష్ గురువుని అభివర్ణించారు కేసీఆర్.

మోదీ గారూ.. దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌నాథ్‌ శిందేలను తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా..? ఇతర ప్రభుత్వాలను కూలగొట్టడం గొప్ప విషయమా..?” అని సీఎం కేసీఆర్​ నిలదీశారు.

తానేవరికీ భయపడనని.. తనకు మనీలేదు, లాండరింగ్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మాతో గోక్కుంటే అగ్గేనని.. మీరు మాతో గోక్కున్నా .. గోక్కోకపోయినా నేను మిమ్మల్ని గోకుతూనే వుంటానని కేసీఆర్ పేర్కొన్నారు. మీ ఉడుత ఊపులకు భయపడేది లేపదన్నారు.

నుపుర్ శర్మ వ్యాఖ్యల్ని తప్పుబడితే సుప్రీంకోర్టుపై కూడా లేఖలు రాయిస్తారా అని సీఎం ప్రశ్నించారు. నుపుర్ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని… ఆ న్యాయమూర్తులకు తాను సెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ ప్రశంసించారు

జడ్జిలనే బెదిరిస్తున్నారని.. ఇదేనా న్యాయవ్యవస్థపై మీకు వున్న గౌరవం అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలుస్తున్నారని.. మాజీ జడ్జిలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిలను ట్రోల్ చేస్తారా అంటూ సీఎం మండిపడ్డారు. కట్టప్ప కథ ఈ సన్నాసికి తెలుసానంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ముఠాగోపాల్ దెబ్బకు గింగిరాలు తిరిగాడన్నారు. ఢిల్లీలో కాళ్లు పట్టుకుని యూపీ నుంచి ఎంపీ అయ్యాడని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతుల్ని ఉగ్రవాదులు అన్నారని , మళ్లీ క్షమాపణలు చెప్పారని దుయ్యబట్టారు. రైతులు ఉగ్రవాదులైతే ఎందుకు క్షమాపణ చెప్పారని కేసీఆర్ ప్రశ్నించారు.

భారత్‌కు చైనా అత్యంత ప్రమాదకారని.. భారత్‌ – చైనా సరిహద్దు ప్రయోగశాల కాదని.. ప్రయోగాలతో దేశానికి ముప్పని మాజీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్స్‌ చెప్పినట్టు కేసీఆర్​ వివరించారు. వర్షాలకు కాశీ ఘాట్‌లో ప్రధాన గోపురం కూలిపోయిందని.. అది దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతున్నట్టు తెలిపారు. కానీ.. బీజేపీ మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటుందని కేసీఆర్​ ధ్వజమెత్తారు.

తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని.. ఎల్‌ఐసీని అమ్మనీయమన్నారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

 

Related posts