telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

సిద్ధిపేట : … ఏఎస్పీ గోవిందు నర్సింహారెడ్డి .. అరెస్ట్‌ చేసిన ఏసీబీ … రిమాండ్ ..

siddipet asp narsimhareddy remanded

ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్ధిపేట అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్‌ చేసింది. ఆయనను ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో హాజరు పరచగా, ఏసీబీ న్యాయస్థనం 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో నర్సింహారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా అక్రమ ఆస్తుల ఆరోపణలతో అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బినామీ ఇళ్లపై గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

సిద్ధిపేట, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, జహీరాబాద్‌, షాద్‌నగర్‌తో పాటు ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలోనూ దాడులు చేశారు. సోదాల్లో కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల 33వేలు నగదు, నర్సింహారెడ్డి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.6.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గొల్కొండలో ఒక విల్లా, శంకర్‌పల్లిలో 14 ఫ్లాట్లు, జహీరాబాద్‌, సిద్ధిపేట, మహబూబ్‌ నగర్‌లో 20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. రెండు కార్లు సీజ్‌ చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.

Related posts