భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా నిలిపేసింది పాకిస్థాన్. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ రైలును నిలిపేస్తున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రతి సోమ, గురువారాల్లో లాహోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బుధ, ఆదివారాల్లో అటారీ నుంచి బయలుదేరుతుంది. 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత షిమ్లా ఒప్పందంలో భాగంగా ఈ సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
సంఝౌతా అంటే ఒప్పందం అని అర్థం. ఇందులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. 1976, జులై 22న రెండు దేశాల మధ్య ఈ రైలు ప్రారంభమైంది. గురువారం లాహోర్ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ రైలును నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇందులో రావాల్సిన ప్రయాణికులు లాహోర్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు.
వరుణ్ ధావన్‌కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు…!?